మూడు దశాబ్దాలుగా మారథాన్​లో..

మూడు దశాబ్దాలుగా మారథాన్​లో..

ఫిట్​నెస్​ కోసం ప్రతిరోజు ఎక్సర్​సైజ్​లోభాగంగా రన్నింగ్​, జాగింగ్ వంటివి చేస్తుంటారు చాలామంది. వాళ్లలో కొందరు అప్పుడప్పుడు రన్నింగ్ రేస్​, మారథాన్​ పోటీల్లో కూడా పాల్గొంటుంటారు. అయితే, రోమ్​కి చెందిన ఓ వృద్ధుడు కొన్నేండ్లుగా మారథాన్​లో పార్టిసిపేట్​ చేస్తున్నాడు. ఈ ఏడాదిలో మారథాన్ అతను పాల్గొని ముప్పది ఏండ్లు పూర్తి అయ్యాయి.

ఆ కథేంటో తెలుసుకుందామా..రోమ్​కి చెందిన ఆంటోనియో రావ్​ వయసు ప్రస్తుతం 92 ఏండ్లు.1933లో పుట్టిన ఆయన సొంతూరు కాలాబ్రియా. పదేండ్ల వయసులో పరుగెత్తడం ప్రారంభించాడు ఆంటోనియో. మొదటిసారి తన సొంతూరు కాలాబ్రియా నుంచి రోమ్​ వరకు రన్నింగ్ చేశాడు. అప్పుడు మొదలుపెట్టిన పరుగు ఇప్పటివరకు ఆపలేదు. టీనేజీలో తన ఫ్రెండ్​ను కలవడం కోసం రోజూ పరుగెత్తేవాడట. కానీ, అది ఎవరూ ఊహించలేని విధంగా తన జీవితంలో భాగమైపోయింది.

అంతేకాదు.. 30 ఏండ్లలో ఎప్పుడూ రోమ్​ మారథాన్ పోటీల్లో ఒక్కటి కూడా మిస్​ కాలేదు. ఈ ఏడాది రోమ్ మారథాన్​ 6 గంటల, 44 నిమిషాల,16 సెకండ్లలో పూర్తి చేశాడు. ఇంకా ఇంట్రెస్టింగ్​ విషయమేంటంటే... గతేడాది కంటే ఈసారి పది నిమిషాల ముందే గోల్ రీచ్ అయ్యాడు. అంటే తన వయసు ముందుకెళ్లే కొద్దీ ఇంకా ఎనర్జిటిక్​గా తయారవుతున్నట్టే. అయితే దీనికంటే గొప్పవిషయం మరొకటి ఉంది.

అదేంటంటే.. 2023లో అంటే 90 ఏండ్లునిండిన తర్వాత రన్నింగ్​లో పాల్గొని కొత్త ప్రపంచ రికార్డు సాధించాడు. ఆ పోటీలో6 గంటల14 నిమిషాలకు పూర్తి చేసిఎమ్​90 వరల్డ్ రికార్డ్​ బ్రేక్​ చేశాడు. తన మారథాన్​ జర్నీ గురించి మాట్లాడుతూ.. ‘రన్నింగ్, వాకింగ్​ అనేవి జీవితంలో ఒక భాగం.  ప్రతి ఒక్కరూ ఇవి చేయాలి. ఈ వయసులో నేను మారథాన్​ పూర్తి చేయగలుగుతున్నానంటే.. ఇతరులు కూడా దీన్ని చేయగలరు. దానికి నేనే ఎగ్జాంపుల్​’ అంటున్నాడు ఆంటోనియో.